Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెప్టెంబర్‌ 5న వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం

సెప్టెంబర్‌ 5న వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 5న జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు కామారెడ్డి  వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. హామీల సాధన కోసం చేపట్టాల్సిన పోరాటం, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. వికలాంగుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 5న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే సమావేశానికి కామారెడ్డి జిల్లాకు చెందిన దివ్యాంగ మిత్రులు, ముఖ్య కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోల బాలరాజ్ గౌడ్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -