బిఆర్ఎస్ మండల నాయకుడు ఢిల్లీ రాజు ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అన్ సాన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల ఎస్సి కాలనీలో నిర్వహిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పూర్తిగా నాసిరకంగా ఉన్నాయని బిఆర్ఎస్ మండల నాయకుడు బానోతు రాజ్ కుమార్ (ఢిల్లీ రాజు) ఆరోపించారు.ఈ సందర్భంగా మంగళవారం రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణ పనులు గుత్తేదారు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నాసిరకమైన ఇసుక, దుబ్బను తలపిస్తున్న సిమెంట్ తదితర నాసిరకమైన మెటీరియల్ తో నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలిపారు. పనులపై పర్యవేక్షణ చేయాల్సిన సంబంధించిన అధికారులు మామ్ముళ్ల తలొగ్గి ఇటువైసిపు కన్నెత్తి చూడకపోవడంతో లక్షల ప్రజాసొమ్మును దుర్వినియోగానికి గురివుతున్నట్లుగా వాపోయారు. గుత్తేదారు నాణ్యతను తాకట్టు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడంతో పది కాలపాటు అగాల్సిన సిసి రోడ్లు ఆనతి కాలంలోనే దెబ్బతినడం ఖాయమన్నారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు పట్టించుకోని రోడ్డు నిర్మాణ పనులపై పర్యవేక్షణ చేసి, నాణ్యమైన పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నాణ్యత ప్రమాణాలు పాటించకుండా సిసి రోడ్డు నిర్మాణ పనులు
- Advertisement -
- Advertisement -



