వెయ్యి దాటిన మృతులు
ఖాట్మండు : నేపాల్‌లో గత వారం సంభవించిన వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటింది. నేపాల్, టిబెట్ వరదలలో గల్లంతయిన 4,400 మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. గుర్తించడం కష్టంగా ఉన్న మృతదేహాలకు అధికారులు సామూహికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దేశంలోని హైడ్రోపవర్ టన్నెల్స్‌లో చిక్కుబడిన కార్మికుల
ఆచూకీ కోసం సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన సుమారు 900 మంది కార్మికుల జాడ తెలియడం లేదు. జిరాంగ్ ఓడరేవు ప్రాంతంలో ఒకే ఒక వాటర్ టవర్ మిగిలి ఉంది. మిగిలిన కట్టడాలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. మృతదేహాల గుర్తింపు కోసం నేపాల్‌కు డీఎన్‌ఏ నిపుణులను పంపుతున్నామని చైనా తెలియజేసింది. డీఎన్‌ఏ పరీక్షా సామగ్రిని, డ్రోన్లను, నీటి శుద్ధి పరికరాలను కూడా పంపుతున్నామని చెప్పింది.
నేపాల్‌లో సామూహిక అంత్యక్రియలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



