పాలస్తీనా ఉపాధ్యాయులకు అనుమతి నిరాకరించిన ఇజ్రాయిల్
జెరుసలేం : ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్న 70 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రవేశ పర్మిట్లను పునరుద్ధరించడంలో ఇజ్రాయిల్ అధికారులు విఫలమవడంతో జెరుసలేంలోని క్రైస్తవ పాఠశాలల్ని మూసివేయాల్సి వస్తోంది. వెస్ట్‌బ్యాంక్ ఐడీలు ఉన్న పాలస్తీనియన్లు తూర్పు జెరుసలేంలో ప్రవేశించాలంటే ఇజ్రాయిల్ జారీ చేసే వర్క్ పర్మిట్లను చెక్‌పాయింట్ల వద్ద చూపించాల్సి ఉంటుంది. అయితే ఇజ్రాయిల్ అధికారులు ఉపాధ్యాయులు, సిబ్బందికి వాటిని ఇప్పటి వరకూ జారీ చేయలేదు. దీంతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించలేక పోతున్నామని, పాఠశాలలను మూసివేయడం మినహా తమకు మరో దారి లేదని జెరుసలేంలోని క్రైస్తవ విద్యా సంస్థలు తెలిపాయి. ఇజ్రాయిల్‌లోనూ, ఆక్రమిత ప్రాంతాల లోనూ పాలస్తీనీయులు, క్రైస్తవుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
జెరుసలేంలో క్రైస్తవ పాఠశాలల మూసివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



