Wednesday, September 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంతీవ్ర పరిణామాలు తప్పవు

తీవ్ర పరిణామాలు తప్పవు

- Advertisement -

అమెరికా క్షిప ణి రక్షణ వ్యవస్థ
మోహరింపుపై జపాన్‌‌కు రష్యా హెచ్చరిక
మాస్కో :
అమెరికా టైఫాన్‌ ‌క్షిపణి రక్షణ వ్యవస్థను జపాన్‌ ‌మోహరిస్తే తీవ్రమైన పర్యవసానాలు వుంటాయని రష్యా హెచ్చరించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జకరొవా మంగళవారం తెలిపారు. సైనిక విన్యాసాల ప్రక్రియ సాకుతో జపాన్‌ ‌భూభాగంపై ఈ తరహా ఆయుధాలను మోహరిస్తున్నట్లు జపాన్‌ ఎంబసీకి చాలా స్పష్టంగా తెలిసింది. ఇది రష్యా భద్రతకు ముప్పు కలిగిస్తున్నందున ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని జకరొవా తెలిపారు. వ్లాదివొస్తొక్‌‌లో తూర్పు ఆర్థిక వేదిక సమావేశాల నేపథ్యంలో ఆమె మాట్లాడారు. జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా చూసేందుకు ప్రతీకార చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు.
1600కిలోమీటర్ల దూరం వరకు తోమహాక్‌ ‌క్షిపణులను తీసుకెళ్ళగల సామర్ధ్యం ఈ టైఫాన్‌ ‌క్షిపణి రక్షణ వ్యవస్థ స్వంతమని జపాన్‌ ‌మీడియా జూన్‌‌ చివరిలో వెల్లడించింది. జపాన్‌‌లో మోహరించిన దీర్ఘశ్రేణి ఆయుధ వ్యవస్థ ఇది. దక్షిణ కురిల్‌ ‌దీవులపై రష్యా సార్వభౌమాధికారం తిరుగులేనిదని జకరొవా పునరుద్ఘాటించారు. ప్రతిపాదిత మిలటరీ విన్యాసాలపై సోమవారం జపాన్‌ ఎంబసీకి రష్యా దౌత్య నిరసన తెలియచేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -