Friday, September 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చిలుకు స్వామికి సన్మానం

తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చిలుకు స్వామికి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
తెలంగాణ ఉద్యమకారుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత డాక్టర్ చిలుకు స్వామిని శుక్రవారం మలిదశ తెలంగాణ ఉద్యమకారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు పోషించిన పాత్రను వారు గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ చిలుకు స్వామి మాట్లాడుతూ ఆలేరులో నిర్మించబోతున్న తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడికి తగిన గుర్తింపు, ప్రతిఫలాలు దక్కాలని ఆకాంక్షించారు. ఉద్యమకారుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా అమరవీరుల స్తూపం నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుల ఆలేరు మండల కో-కన్వీనర్ ఇక్కిరి శ్రీనివాస్‌తో పాటు మొరిగాడి అశోక్, ఆడెపు బాలస్వామి,ఆర్. జనార్ధన్, కర్రె అశోక్, కళ్లెపు అడవయ్య, ఎర్ర జాన్సన్, చిమ్మి అబ్బ సాయిలు, జింకల రామకృష్ణ,కంతి మహేందర్, బేతి రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -