Friday, September 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ సామాజిక  సేవకుడి నీ సన్మానించిన ఎమ్మెల్యే

 సామాజిక  సేవకుడి నీ సన్మానించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : ఇటీవల 80 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా హైద్రాబాద్ లో మాజీ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల్ చారి  చేతుల మీదుగా ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా శుక్రవారం  సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్  నీ ఎమ్మెల్యే పైడి  రాకేష్ రెడ్డి  శాలువ తో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పట్వారీ తులసి స్వచ్ఛంద సామాజిక సేవలు ఆదర్శం అని వారికి ఇలాంటి పురస్కారాలు రావడం మన జిల్లా కి గర్వకారణం అని అన్నారు. వీరికి మా వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భవిష్యత్తు లో వీరి సేవలు మోదీ వద్దకు తీసుకొని వెళ్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో  నాయకులు మందుల బాలు , వేణు, కౌన్సిలర్లు పోచంపేటశ్రీనివాస్,అన్నారం రాజు,శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -