Friday, September 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్‌ చౌరస్తాలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి బిచ్కుంద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -