బంగారు ఆభరణాలు, నగదు అపహరణ.. ఎస్సై మోహన్‌రెడ్డి పరిశీలన
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి మూడు తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు జరిగినట్లు ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. చోరీకి గురైన ఇళ్లను పరిశీలించిన ఆయన, ఇంటి యజమానుల నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత అపహరణకు గురైన నగదు, బంగారు, వెండి ఆభరణాల పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. రెండు ఇళ్లలో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు అపహరణకు గురైనట్లు గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది. ఇంటికి తాళం వేసి కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లగా, మరికొందరు విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. ఒకే రోజు మూడు ఇళ్లలో చోరీలు జరగడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందాల్సి ఉందని ఎస్సై తెలిపారు.
మేనూర్‌లో ఒకే రోజు మూడు ఇండ్లలో చోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



