- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని శనివారం మండల కేంద్రంలోని డిగ్రీ కాళాశాలలో ప్రిన్సిపల్ సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఒక సామాజిక బాధ్యత అని, సమాజంలో విద్యార్థులను ఉన్నతమైన స్థాయికి ఎదిగేలా తీర్చేదిద్దేవారని అన్నారు. అనంతరం విద్యార్థులందరూ ప్రిన్సిపల్ను సన్మానించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



