– ఆయిల్‌ఫెడ్ సీఎస్‌ఆర్ నిధులతో నిర్వహణ
– పనులను పరిశీలించిన పీ అండ్ పీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
దమ్మపేట మండలం ముష్టిబండ శివారు ప్రాంతంలోని శివాలయంలో ఆయిల్‌ఫెడ్ సంస్థ రూ.36 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో సౌకర్యాలు సమకూరుస్తుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పనులను ఆయిల్‌ఫెడ్ పీ అండ్ పీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఆలయ పురోగతి పనులతో పాటు దేవాలయ ప్రాంగణంలో నిర్మించిన సీసీ రోడ్డు పనులను తనిఖీ చేశారు.
అనంతరం అశ్వారావుపేట, అప్పారావుపేట పరిశ్రమల్లో ప్రస్తుతం కొనసాగుతున్న పనులతోపాటు భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. పనులను వేగవంతం చేయాలని ఆయా పరిశ్రమల మేనేజర్లు కార్తీక్, నాగబాబుకు సూచించారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.



