– సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి
– ఉద్యానశాఖ జిల్లా అధికారి కిశోర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్‌పామ్ సాగులో నీటి వినియోగాన్ని పొదుపు చేయడంతోపాటు మొక్కలకు సమపాళ్లలో నీటిని అందించేందుకు డ్రిప్ నీటిపారుదల ఎంతో కీలకమని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి కిశోర్ తెలిపారు. ఆయిల్ ఫెడ్ పరిధిలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులు డ్రిప్ పరికరాలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న డ్రిప్ నీటిపారుదల పరికరాలపై వర్గాల వారీగా సబ్సిడీ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ రైతులకు 80 శాతం, సాధారణ రైతులకు 70 శాతం సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. అర్హత కలిగిన ఆయిల్‌పామ్ రైతులు సబ్సిడీని సద్వినియోగం చేసుకుని తమ తోటల్లో డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
డ్రిప్ వ్యవస్థను క్రమం తప్పకుండా పరిశీలించి ఎమిటర్లు మూసుకుపోకుండా చూడాలని, పైపుల్లో లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. నేల తేమను బట్టి అవసరమైన మేరకు నీటిని అందించాలని, మొక్కల చుట్టూ మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమను సంరక్షించాలని తెలిపారు. కొత్తగా నాటిన, చిన్న వయసున్న ఆయిల్‌పామ్ మొక్కలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించడంతోపాటు డ్రిప్ వ్యవస్థ ద్వారా ప్రతి మొక్కకు అవసరమైన నీటిని సకాలంలో అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు. దీంతో తోట ఆరోగ్యంగా పెరగడంతోపాటు దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. నీరు నిల్వ ఉండకుండా తగిన డ్రైనేజీ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
17 కంపెనీల ద్వారా డ్రిప్ పరికరాల సరఫరా:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 17 మైక్రో ఇరిగేషన్ (ఎంఐ) కంపెనీల ద్వారా రైతులకు డ్రిప్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని ఉద్యానశాఖ తెలిపింది. రైతులు ఆయా కంపెనీల ప్రతినిధులను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.
డ్రిప్ కంపెనీలు:
జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, నెటాఫిమ్ ఇరిగేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫినోలెక్స్ ప్లాసన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గ్లోబల్ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్‌మెంట్స్, కోథారి అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిగ్నెట్ ఇండస్ట్రియల్ లిమిటెడ్, పారిక్షిత్ ఇరిగేషన్ లిమిటెడ్, స్కిప్పర్ మెట్జర్ ఇండియా ఎల్‌ఎల్‌పీ, రివులిస్ ఇరిగేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా ఈపీసీ, కెప్టెన్ పాలీప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, బాల్సన్ పాలీప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, వేదాంత పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సెన్‌మార్క్ అగ్రోనామిక్స్, భవిష్య ఇరిగేషన్ వర్క్స్ లిమిటెడ్, ఆర్.ఎం. డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, భూమి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్.
“నీటి పొదుపు–పంటకు భద్రత–రైతుకు అధిక దిగుబడి” అనే లక్ష్యంతో రైతులు సూక్ష్మ నీటిపారుదల విధానాలను వినియోగించుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి కోరారు.
సంప్రదించాల్సిన డ్రిప్ కంపెనీలు – ఫోన్ నంబర్లు:
జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ – 9494498191
నెటాఫిమ్ ఇరిగేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – 8142244919
ఫినోలెక్స్ ప్లాసన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ – 9848580551
గ్లోబల్ ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్‌మెంట్స్ – 9000423543
కోతారి అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ – 8106267244
సిగ్నెట్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ – 9603410276
పారిక్షిత్ ఇరిగేషన్ లిమిటెడ్ – 9000423543
స్కిప్పర్ మెట్జర్ ఇండియా ఎల్‌ఎల్‌పీ – 9704888150
రివులిస్ ఇరిగేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – 8247088089
మహీంద్రా ఈపీసీ – 8099930347
కెప్టెన్ పాలీప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ – 9652378100
బాల్సన్ పాలీప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ – 9441927984
వేదాంత పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ – 9866905304
సెన్‌మార్క్ అగ్రోనామిక్స్ – 9550254410
భవిష్య ఇరిగేషన్ వర్క్స్ లిమిటెడ్ – 9640876806
ఆర్.ఎం. డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్ – 9963272852
భూమి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ – 8465079550



