మాడ్రిడ్ : టెన్నిస్ వరల్డ్ నం.2, స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ మాడ్రిడ్ ఓపెన్‌కు దూరమయ్యాడు. బార్సిలోనా ఓపెన్‌లో ఆడుతూ మణికట్టు గాయానికి గురైన అల్కరాస్.. ఈ నెల 21 నుంచి ఆరంభం కానున్న మాడ్రిడ్ ఓపెన్‌లో ఆడటం లేదు. ఈ విషయాన్ని కార్లోస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మోంటోకార్లో మాస్టర్స్‌లో సినర్ చేతిలో ఓడి వరల్డ్ నం.1 ర్యాంక్ కోల్పోయిన అల్కరాస్.. ఈ వారం సినర్ విశ్రాంతి తీసుకోవటంతో బార్సిలోనా విజయంతో మళ్లీ అగ్రస్థానంపై కన్నేశాడు. కానీ, ఫ్రెంచ్ ఓపెన్ ముంగిట మట్టికోర్టు టోర్నమెంట్ మాడ్రిడ్ ఓపెన్‌కు దూరం కావటంతో పారిస్‌లోనూ అల్కరాస్ అవకాశాలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 2024, 2025లో అల్కరాస్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన నొవాక్ జకోవిచ్ సైతం గాయంతో మాడ్రిడ్ ఓపెన్‌లో ఆడటం లేదు.



