స్పీకర్‌ను అవమానించారు :
మీడియాపాయింట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అసెంబ్లీ ఎదుట నిరసన సందర్భంగా కేటీఆర్ పోలీసులపై దాడి చేశారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీదర్‌బాబు విమర్శించారు. స్పీకర్ కుర్చీలో ఎవరూ కూర్చున్నా అంత ఘోరమైన భాష ఉపయోగించడం దారుణమని అన్నారు. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోలీస్ కాలర్ పట్టుకున్నాడని చెప్పారు. వీడియోల్లో పోలీసులపైన దాడి స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న మేం ఏ నాడు పోలీసులపైనా ఈ విధంగా దాడులు చేయలేదని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ మీడియాపాయింట్‌లో మంత్రి మాట్లాడుతూ కేటీఆర్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,నవీన్ రెడ్డి దాడి చేసినట్టు వీడియోల్లో కనిపిస్తున్నదన్నారు.
అసభ్యపదజాలంతో పోలీసులను దూషించారని చెప్పారు. సీనియర్ శాసనసభ్యుల తీరు చాలా దారుణంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే రూల్స్ రూపొందించిందని చెప్పారు. బ్యాడ్జీలు, ప్లకార్డులు నిషేదం అని వాళ్లే చెప్పారని గుర్తు చేశారు. టీషర్టులపైన స్లోగన్స్ వేసుకుని రావడం సభా సంప్రదాయలకు విరుద్దమని తెలిపారు. రాహుల్ గాంధీ వేసుకున్న టీషర్టు పైన ఫ్రింట్ లేదు.. బ్లాక్, వైట్ ,పింక్ .. ఏదైనా కలర్లు వేసుకోవచ్చని గుర్తుచేశారు. టీషర్టులపైన స్లోగన్స్ వేసుకుని వస్తే దాన్ని ప్లకార్డులుగా పరిగణిస్తారని చెప్పారు. ఈ విషయం కేటీఆర్, హరీష్ రావు, ఇతర సభ్యులకు తెలుసని చెప్పారు. మహిళల ముందు డిసెంట్ గా ఉంటడం ముఖ్యమని చెప్పారు. ఏ కలర్ డ్రస్సు వేసుకుని సభలోకి వచ్చినా ఆపేది లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిరసనలు తెలపడానికి అన్ని అవకాశాలున్నాయని వివరించారు. సభా గౌరవాన్ని పెంచడంలో స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ అన్ని నిర్ణయాలు తీసుకుంటారని తెలియజేశారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ నడుస్తున్నదన్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్లకార్డులు అనుమతించకపోతే పక్కన పెట్టి మర్యాదపూరక్వంగా సభకు వెళ్లామని గుర్తు చేశారు. మహిళా శాసనసభ్యురాళ్లకు ఇబ్బంది జరిగిందని తెలియగానే సీఎం పోలీసు అధికారులతో సమీక్ష చేశారని చెప్పారు. మహిళా శాసనసభ్యుల విషయంలో ఎక్కడైనా తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మా నాయకురాలే స్వయంగా మహిళ అని, మహిళలను గౌరవిస్తామన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సవరించుకుంటామని చెప్పారు. మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతి ఇచ్చామనీ, వాళ్లను అడ్డుకోలేదని తెలిపారు. స్పీకర్ పైన అత్యంత హేయంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తన కామెంట్లను వెనక్కి తీసుకుంటామని అంటున్నారని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు తమ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఇప్పటి వరకు ఖండించలేదనీ, కనీసం స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ వ్యాఖ్యలపైన స్పందించడం లేదన్నారు.
కేటీఆర్ పోలీసులపై దాడిచేశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


