Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎయిర్ పోర్ట్‌‌లో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్

ఎయిర్ పోర్ట్‌‌లో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్

- Advertisement -


లుక్ అవుట్ నోటీస్ పై అదుపులోకి 
తీసుకున్న అధికారులు
​నవతెలంగాణ-శంషాబాద్

​ ప్రముఖ యూట్యూబర్ నందనను సోమవారం శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ నోటీస్ పై అరెస్టు చేశారు. అమెరికా నుంచి ఇమిరెట్స్ విమానం ఈకే-520 విమానంలో శంషాబాద్ వచ్చిన ఆమెపై లుక్ అవుట్ నోటీసు ఉండటంతో ఇమిగ్రేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్‌లో ఉంచారు. ఆమెపై ఆంధ్రప్రదేశ్‌‌లోని విజయవాడ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌‌లో నవంబర్ 22న కేసు నమోదైంది. లండన్‌‌లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలపై నందన దంపతులపై ఈ కేసు నమోదు అయినట్టు సమాచారం. ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ నుంచి మహిళ ఎస్‌ఐ, ఓ అడ్వకేట్ ఆమెను శంషా బాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్ నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకొని వెళ్లారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -