నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరీకి ఉంది:మల్లు లక్ష్మి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్:
అసెంబ్లీ ముందు నిరసన సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముందు నిరసన తెలియజేస్తున్న మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణజ్యోతి అన్నారు . సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పట్ల అత్యంత దురహంకారంతో, అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రా రెడ్డి గొంతు నొక్కడం, సునీతా లక్ష్మారెడ్డి చీరలాగడం పట్ల నిరసన తెలిపారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అభిప్రాయపడ్డారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన రక్షక భటులే, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఈ రకమైన అసభ్యకరమైన, భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు విమర్శించారు. ఇది కేవలం ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి మాత్రమే కాదనీ, మహిళా లోకానికే జరిగిన తీవ్ర అవమానమన్నారు. ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల భౌతిక దాడికి పాల్పడి, అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యంపై ఐద్వా ఖండన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



