Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీ స్పీకర్ కు
 క్షమాపణ చెప్పాలి

అసెంబ్లీ స్పీకర్ కు
 క్షమాపణ చెప్పాలి

- Advertisement -


కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

రాజ్యంగ బద్ధమైన పదవిలో ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. శాసన సభ, శాసన మండలి సభ్యులు ఆయా సభల ఔన్నత్యాన్ని కాపాడేలా నడుచుకోవాలని తెలిపారు. చట్ట సభల సభ్యులుగా అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. దానికి విరుద్ధంగా వ్యవహరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాను చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్ కు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
పోలీసుల తీరు అత్యంత దుర్మార్గం
తెలంగాణ అసెంబ్లీ వద్ద మహిళా శాసన సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని కవిత మరో ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ మహిళా ఎమ్మెల్యేల గొంతు పట్టి నెట్టేయడం, చీరలు లాగడం, బూటు కాళ్లతో తొక్కి హింసించడం దారుణమని పేర్కొన్నారు. మహిళా శాసన సభ్యులకే ఈ రాష్ట్రంలో భద్రత లేదంటే సామాన్య మహిళల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలపై హింస, దాడులు పెరుగుతు న్నాయనీ, ప్రస్తుత డీజీపీ బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -