ఎమ్మెల్సీ మధుసుదన్‌పై
చర్యలకు నేడు విస్తృత చర్చ
నవతెలంగాణ-హైదరాబాద్
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధుసుదన్ చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై సభ అట్టుడికింది. స్పీకర్ పీఠంపై దళితుడు కూర్చోవటాన్ని దళిత వ్యతిరేక బిఆర్‌ఎస్ జీర్ణించుకోవటం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 22ఏ సమస్య కొత్తదేమీ కాదు, ముందున్న ప్రభుత్వాల నుంచి వస్తున్నదే. దళిత స్పీకర్‌పై అవమానకర వ్యాఖ్యలుచేసిన మధుసుదన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి గడ్డం వివేక్ వెంటకస్వామి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, గడ్డం వినోద్ కుమార్ , యెన్నండ శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, బీర్ల ఐలయ్య కేఆర్ నాగరాజు కోరారు.
మధుసుదన్‌పై చర్యలు తీసుకునేందుకు సిపిఐ, ఎంఐఎం శాసన సభ్యులు సహా ఇతర పార్టీల సభ్యుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ అంశాన్ని రేపుకు చర్చకు పెడదామని శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పీకర్‌ను కోరారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. శాసన సభను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
శాసనసభ నేటికి వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



