Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోరాట యోధుల త్యాగాలు ప్రజలకు తెలియాలి

పోరాట యోధుల త్యాగాలు ప్రజలకు తెలియాలి

- Advertisement -

అమరుల పోరాటాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు
బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
జనగామ జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
నవతెలంగాణ- జనగామ

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా శుక్రవారం జనగామ జిల్లా మరిగడి, వడ్లకొండ గ్రామాలతో పాటు బచ్చన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జాన్‌‌వెస్లీ అమరవీరుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. జనగామ మండలం మరిగడి గ్రామంలో శాఖ కార్యదర్శి కూరాకుల శ్రీను అధ్యక్షతన నిర్వ హించిన సభలో వెస్లీ మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వారోత్సవాలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించి, పోరాట యోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాలని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేశ చరిత్రలోనే గొప్ప ప్రజా పోరాటమన్నారు. నిజాం నిరంకుశ పాలన, భూ స్వాముల దోపిడీ, వెట్టిచాకిరీ, అణచివేతకు వ్యతిరేకం గా రైతులు, వ్యవసాయ కూలీలు, పేదప్రజలు ఐక్యం గా పోరాడారని గుర్తుచేశారు. ఆ పోరాట చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను నేటి తరానికి తెలియ జేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని అన్నారు. రోజురోజుకు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదలతో పాటు ఆర్థిక అనిశ్చితి నెలకొందన్నారు. హత్యలు, లైంగికదారులు, దోపిడీలు రోజురోజుకు పెరుగు తున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు ఉదృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్‌ మాట్లాడుతూ కేంద్రంలోని మో‌డీ ప్రభుత్వం ప్రజాసమ స్యలు పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల్లో పేద ప్రజల ఓట్లతో అధికారం లోకి వచ్చి, వారి హక్కులను హరించే విధానాలను అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యో గులు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను తక్ష ణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, ఇర్రి అహల్య, రాపర్తి రాజు, సింగరపు రమేష్, రాపర్తి సోమయ్య, బోట్ల శేఖర్, జిల్లా కమిటీసభ్యులు బోడ నరేందర్, పోత్కానూరి ఉపేందర్, బూడిద గోపి, జోగు ప్రకాశ్, భూక్యా చెందు నాయక్, సుంచు విజేందర్, మునిగేలా రమేష్, రామావత్ మీట్యా నాయక్, బోడ రాములు, దండు శ్రీను, బాల్నే కిష్టయ్య, కాసాని సిద్ధులు, బండి చెందర్, మల్లేష్, సంపత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -