Tuesday, April 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖండేబల్లూర్ అంగన్ వాడిలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్

ఖండేబల్లూర్ అంగన్ వాడిలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ లో రెండవ సెంటర్ అంగన్వాడీ టీచర్ సుమలత అధ్యక్షతన మంగళవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఫేర్వెల్ పార్టీని పురస్కరించుకుని అంగన్వాడి చిన్నారులకు పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటపాటలతో పిల్లలు ఎంతగానో అలరించారు. అనంతరం విద్యార్థులకు గుర్తింపుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ లను సర్పంచ్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఎమ్ఎల్ హెచ్ పి మనీలా, ఏ డబ్ల్యు సి సుమలత, ఆశా రుక్మిణి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -