నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను తెలియజేస్తూ బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి.సయ్యద్ నాయకత్వం వహించారు. ర్యాలీ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా తిరుగుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య సదుపాయాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్ లు, డిజిటల్ విద్య వంటి సదుపాయాలపై అవగాహన కల్పించారు. అలాగే ఐదేళ్లు నిండిన పిల్లల ఇళ్లను సందర్శించి, వారికి ప్రభుత్వ పాఠశాలలో చేరిక చేయాలని తల్లిదండ్రులను ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిరిమర్తి రేణుక నరసయ్య, ఉపసర్పంచ్ పద్మ శశిరేఖ, గ్రామస్తులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పంగ సరిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బడిబాటతో విద్య చైతన్యం..గ్రామంలో అవగాహన ర్యాలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



