Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాలుష్య నివారణకు మట్టి వినాయకున్నే ప్రతిష్టించండి

కాలుష్య నివారణకు మట్టి వినాయకున్నే ప్రతిష్టించండి

- Advertisement -

పద్మశాలి సంఘం సభ్యుడు సూరిపల్లి రాము-రాణి
నవతెలంగాణ-నెల్లికుదురు

కాలుష్య నివారణకు మట్టి వినాయకుడినే ప్రతిష్టించండని పద్మశాలి సంఘం నాయకుడు సూరిపల్లి రాము-రాణి తెలిపారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఆదివారం మట్టితో తయారు చేసే వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణంలో రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందనీ, దాని నివారించేందుకు మనవంతు ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందులో భాగంగా మేమే స్వయంగా మట్టి వినాయకుని తయారు చేసుకుని, వినాయక చవితికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కైరం కొండ జ్యోతి, సూరిపల్లి అమృత తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -