నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ఆర్ఎంపీ, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు కుక్కడపు అశోక్ అధ్యక్షతన ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులు భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, సంయుక్త కార్యదర్శి ముడుతనపల్లి ప్రభాకర్ హాజరై పలు అంశాలపై చర్చించారు. మండల కమిటీ పదవీకాలం ముగియడంతో జిల్లా ఆదేశాల మేరకు హడక్ కమిటీ నియామకం చేసినట్లుగా తెలిపారు. హడక్ కమిటీ కన్వీనర్ గా చొప్పరి రాజయ్య, కోకన్వీనర్ గా దేనవేన సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా జంగిడి సమ్మయ్య, కోట నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.
నూతన కమిటీ నియామకం అయ్యేంత వరకు హడక్ కమిటీ కొనసాగునట్లుగా తెలిపారు. నూతన అధ్యక్షుడుగా పోటీలో ఉండాలనుకునే వారు గతంలో మండల అధ్యక్షుడుగా చేసినవారు అనర్హులుగా పరిగణలోకి వస్తారని, కమిటీ నియామకం తేదీ త్వరలోనే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించునట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గ్రామీణ వైద్యులు వొన్న తిరుపతి రావు, లింగన్నపేట శ్రీదర్, బాపురావు, బండి సుధాకర్, కేశవ్, అజిత్, అజిమ్, చెంద్రయ్య, శంకర్, రాజు నాయక్, సంపత్, సంతోష్ పాల్గొన్నారు.



