స్మగ్లర్లు, సరఫరాదారుల గుండెలో ‘హెచ్‌న్యూ’ గుబులు
హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లో అనేక కేసుల ఛేదన
నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ మరింత బలోపేతం
నవతెలంగాణ- సిటీబ్యూరో
కొన్ని కాలేజీలు, హోటళ్లు.. పార్క్‌లు ఇలా ఎక్కడ పది మంది విద్యార్థులు రహస్యంగా మాట్లాడుకున్నా వినిపించేది పార్టీలు, డ్రగ్స్ గురించే.. ముంబయ్, గోవా ప్రాంతాల్లో కొనసాగే విషసంస్కృతి నగరంలోనూ ఉంది. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా మాదకద్రవ్యాలు నగరానికి చేరుతు న్నాయి. యూనివర్సిటీలు, కాలేజీలు, పబ్‌లు, రిసార్టులు యువతీయువకులు ఎక్కడ ఏ చిన్నపార్టీ చేసుకున్నా మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తున్నారని పలు సంఘటనల్లో వెలుగుచూశాయి. మొదట సిగరెట్‌తో మొదలై పార్టీలు, పబ్బులు, వీకెండ్ పార్టీలకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో స్మగ్లర్లు హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా చేసుకున్నారు. మత్తులో కొన్ని సందర్భాల్లో యువతులపై సామూహిక లైంగికదాడులకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి. దాంతో హైదరాబాద్ నగరాన్ని మాదకద్రవ్య రహిత నగరంగా మార్చడంతోపాటు స్మగ్లర్ల ఆటకట్టిం చేందుకు (హెచ్-న్యూ) హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను రంగంలోకి దించారు. ఇప్పటికే హెచ్-న్యూ బృందాలు హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక కేసులను ఛేదించిన విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల స్మగ్లర్ల నుంచి సరఫరాదారులు, వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతోంది.
ఈజీ మనీ కోసం
ఈజీ మనీ కోసం దుండగులు డ్రగ్స్‌ను దేశాల సరిహద్దులు దాటిస్తున్నారు. ముఖ్యంగా నైజీరియా, ఉగాండా దేశాలకు చెందిన వారు స్టూడెంట్ వీసాలపై భారత్‌కు వస్తున్నారు. ఇక్కడివారి అవసరాలను అనుకూలంగా మలుచుకుని డ్రగ్స్ దందా మొదలు పెడుతున్నారు. ముందుగా ఢిల్లీ, ముంబయి, బెంగళూర్, గోవాను కేంద్రంగా చేసుకుం టున్నారు. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఏకంగా ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. తర్వాత చీకటి దారుల్లో చేరాల్సిన చోటుకు చేరుస్తున్నారు. వాట్సప్‌లు, రహస్య గ్రూపుల ద్వారా ఆర్డర్లు తీసుకుని కొరియర్ ద్వారా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి.. చివరకు వారే సరఫరా దారులుగా మారుతున్న ఘటనలు కొకోళ్లలు.
ప్రపంచ వ్యాప్తంగా 110రకాలు
ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న మాదకద్రవ్యాలు దాదాపు 110 రకాలున్నాయని తెలుస్తోంది. వాటిలో నార్కొటిక్ డ్రగ్స్ 10, సైకోట్రోఫిక్ డ్రగ్స్ 100వరకు ఉన్నాయి. చరాస్, రూఫీ, కెమిటన్, షషేష్ తదితర మాదకద్రవ్యాలను ల్యాబ్‌లల్లో తయారు చేస్తున్నారు. కొకైన్, హెరైన్, మార్ఫిన్ వంటివి నార్కొటిక్ డ్రగ్స్ పరిధిలోకి వస్తాయి. బ్రౌన్‌షుగర్, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏలను దక్షిణ అమెరికా, దక్షిణఫ్రికా, నేపాల్ సరిహద్దుల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మరికొన్ని చెట్లు, రసాయన పదార్థాలతో మాదక ద్రవ్యాలను తయారు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మందగిస్తుంది. కండ్ల మందు పది పదిహేను నిమిషాల ముందు జరిగిన సంఘటనలు మరిచిపోతాం. నేడ యువకులు చిన్న పార్టీ కోసమైనా రూ. 20 నుంచి 30వేలను ఖర్చు చేస్తున్నారు.
2 బృందాల నుంచి 5 ప్రత్యేక విభాగాలకు..
నగరంలో మాదకద్రవ్యాల నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ)ను 2 బృందాల నుంచి 5 ప్రత్యేక విభాగాలకు విస్తరించారు. మేధో సమాచార సేకరణ (ఇంటెలిజెన్స్ డ్రైవ్) ప్రాతిపదికన పనిచేసే ఈ విభాగం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం సాగిస్తుంది. రాజేంద్రనగర్‌లో ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ విభాగంలోని ‘టీమ్ 14’కు ఇన్‌స్పెక్టర్లు శ్రీకాంత్, నాగార్జున్ నేతృత్వం వహిస్తారు. మాదకద్రవ్యాల నివారణ, గుర్తింపు, దాడులు, సీజ్ చేయడం, లోతైన విచారణ, నిందితులకు శిక్ష పడేలా చేయడం వంటి అంశాలపై ఈ బందం ‘జీరో టాలరెన్స్’ (సహించేది లేదు) విధానంతో పనిచేస్తుంది.
పక్కా సమాచారంతో దాడులు
వ్యవస్థీకృత డ్రగ్ నెట్‌వర్క్‌లను ఛేదించడానికి పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తాయి. మాదకద్రవ్యాల సరఫరా దారులు, విక్రయదారులు, వినియోగదారుల సమగ్ర సమాచారాన్ని సేకరించి పర్యవేక్షిస్తాయి. ఇతర శాఖల సమన్వయంతో నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా సాక్షాలను సమర్పిస్తాయి. నిరంతర నిఘా వేస్తాయి. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రయత్నిస్తాయి.
మాదకద్రవ్యాల నిర్మూలనలో సక్సెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



