Wednesday, September 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

- Advertisement -

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌‌రావు
36వ మహాసభల సందర్భంగా.. 
36 బెలూన్లు ఆవిష్కరణ


నవతెలంగాణ-చింతకాని

నల్లగొండ పట్టణంలో నవంబర్‌ 15 ‌నుంచి 18 వరకు జరగనున్న ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు కోరారు. ఈ మహాసభల సందర్భంగా పదివేల మందితో ప్రదర్శన, లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏఐకేఎస్ జాతీయ 36వ మహాసభల నేపథ్యంలో మంగళవారం ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో 36 బెలూన్లను పోతినేని సుదర్శన్ రావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ ఎగురవేశారు. ఈ సందర్భంగా స్థానిక సొసైటీ కార్యాలయం నుంచి మండల కేంద్రానికి భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ మహాసభలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై పలు తీర్మానాలు చేయనున్నట్టు తెలిపారు. శాసనసభ, శాసన మండలిలో ప్రజా సమస్యలు చర్చించకుండా బీజేపీ, బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు కేసులు, దాడులు చేసుకోవటం దారుణమన్నారు. మధిరకు అనేకమంది ఎమ్మెల్యేలుగా పని చేశారని, కానీ ఏ ఎమ్మెల్యేకు కమిషన్ పేరు రాలేదని, కానీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మాత్రం కమిషన్ పేరు దక్కిందని విమర్శించారు. చివరకు డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు కమిషన్లు అడుగుతున్నారని, కాంట్రాక్టర్లు ధర్నా చేశారంటే మధిరను కమిషన్ మధిరగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మహాసభల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -