ఆరుట్ల కమలాదేవి: 1938 ఆంధ్ర మహాసభల్లో చేరింది. 1948లో అరెస్టయింది. ఈమెను అనేక జైళ్ళల్లో నిర్బంధించారు. బైరాన్పల్లి మహిళలు: గ్రామ రక్షణ కోసం నిజాం సైన్యానికి ఎదురుతిరిగి ప్రాణాలర్పించిన బైరాన్పల్లి మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
గంగసాని ఆండాళమ్మ: పోరాటంలో కీలకమైన పాత్ర పోషించిన గంగసాని కుటుంబానికి చెందిన ఆండాళమ్మ త్యాగం మరువలేనిది.
మల్లు స్వరాజ్యం : భూస్వామ్య కుటుంబంలో పుట్టి అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి ప్రభావంతో 12 ఏండ్లకే తుపాకీ పట్టారు. అజ్ఞాత జీవితం అనుభవించారు. దొరలకు, భూస్వాములకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ విధంగా మనకు తెలియని మన చరిత్రలో ఎందరో మహిళలు తమ ప్రాణాలకు తెగించి ఉద్యమించారు. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే నేడు సాగుతున్న అనేక మహిళా ఉద్యమాలకు పునాదిగా, గొప్ప స్ఫూర్తిగా నిలిచింది
దళాల్లో చేరిన మహిళలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



