అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి

– కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌
నవతెలంగాణ-ఖమ్మం
గ్రీవెన్స్‌ డేలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ డేలో జిల్లా కలెక్టర్‌ అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి సత్వర చర్య నిమిత్తం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సత్వర పరిష్కారం కలిగిన దరఖాస్తులు కల్లూరు మండలం ఖాన్‌ఖాన్‌పేటకు చెందిన తుమ్మల గంగాధరరావు తనకు గల వ్యవసాయ భూములు ఎ.3.13 కుంటలు, నిషేదిత భూములుగా ఉన్న వాటిని తొలగింపుకు సమర్పించిన దరఖాస్తును, తుమ్మల ఝాన్సీకుమారికి సంబంధించిన 38 కుంటల వ్యవసాయ భూమిని నిషేదిత జాబితా నుండి తొలగించాల్సిందిగా సమర్పించిన దరఖాస్తును, కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగు గ్రామంకు చెందిన పి.గోవిందరావు తనకు గల 18 కుంటల వ్యవసాయ భూమి మిస్సింగ్‌ జాబితాలో గలదని సమర్పించిన దరఖాస్తులను కలెక్టర్‌ పరిశీలించి వెంటనే పరిష్కారం చూపారు. ఖమ్మం నగరం 59వ డివిజన్‌కు దానవాయిగూడెంకు చెందిన వెన్ను సుమతి తాము దానవాయిగూడెం కాలనీ ఇం.నెం.12-3-158/1760/40 లో నివాసం ఉంటున్నామని, తమకు జి.ఓ 58 క్రింద క్రమబద్దీకరించి, ఇంటి పట్టా మంజూరు చేయబడలేదని, దాని కారణంగా విద్యుత్‌ మీటరు కూడా ఇవ్వడంలేదని, ఇంటి పట్టా, విద్యుత్‌ మీటరు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఖమ్మం అర్భన్‌ మండల తహశీల్దారును ఆదేశించారు. తల్లాడ మండలం కేశవాపురం గ్రామస్తులు తమ గ్రామంలో ఎస్సీ మాదిగ కులముకు చెందిన మాగంటి కమల భర్త ఆదాము కడు బీదవారని వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించగలరని, సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం తహశీల్దారు తల్లాడను ఆదేశించారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంకు చెందిన మండెపూడి బాబు, మండెపూడి సుధాకర్‌, అన్నదమ్ములు తమకు పాతర్లపాడు రెవెన్యూ సర్వేనెం.183/అ1లో య.3′ 20 కుంటల భూమి తమ తండ్రిగారి నుండి వారసత్వంగా వచ్చినదని, అ భూమి ధరణిలో 0.50 గుంటల భూమి మాత్రమే నమోదు కావడం జరిగినదని, అట్టి భూమిని సర్వేచేసి, తమ భూమికి పట్టాదారు పాస్‌ బుక్‌ ఇప్పించగలరని, సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం తల్లాడ తహశీల్దారును ఆదేశించారు. కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంకు చెందిన పెద్ది కేశవరావు తనకు గట్టుసింగారం రెవెన్యూ నందు సర్వేనెం.332/4 లో ఎ 1.500 కుంటల భూమి రికార్డులో ప్రోహిబ్కెటెడ్‌ ల్యాండ్‌గా నమోదు కావడం జరిగినదని, అట్టి నిషేధిత జాబితా నుండి తొలగించగలరని సమర్పించిన దరఖాస్తును దరఖాస్తును తగు చర్య నిమిత్తం తల్లాడ తహశీల్దారును ఆదేశించారు. కొణిజర్ల మండలం రాజ్యాతండాకు చెందిన తెజావత్‌ శోభన్‌ బాబు, తేజావత్‌ నాగరాజు తన తండ్రి గారి వద్ద నుండి ఖమ్మం అర్భన్‌ మండలం మల్లెమడుగు రెవెన్యూలో సర్వేనెం.160అ/2లో ఎ.1′ 26 గుంటలు భూమి వచ్చినదని అట్టి భూమిని తమ పేరున వారసత్వ రిజిస్ట్రేన్‌ చేయాల్సిందిగా కోరగా ఇబ్బందులకు గురి చేయడం జరిగినదని ఇట్టి భూమిని తమపేరున రిజిస్ట్రేషన్‌ చేయించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఖమ్మ అర్భన్‌ తహశీల్దారును ఆదేశించారు. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంకు చెందిన యడవల్లి నరేష్‌కుమార్‌ తనకు తన తండ్రి నుండి వారసత్వంగా మండలపాడు రెవెన్యూ నందు సర్వేనెం.244 నందు ఎ1’10 కుంటలు భూమి వచ్చినదని అందులో 0.34 కుంటలు విక్రయించగా మిగిలిన 0.16 కుంటలు ఉండగా 0.14 కుంటలు మాతమ్రే ఇచ్చియున్నారని, సర్వే చేయించి తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం పెనుబల్లి తహశీల్దారను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ శిక్షణ కలెక్టర్‌ మయాంక్‌ సిగ్‌, అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌, జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love