క్రీడలతో ఉల్లాసం, ఆరోగ్యం

– క్రీడలతో పాటు చదువులో రాణించాలి
– మంత్రి పొంగులేటి కార్యాలయ ఇన్‌చార్జి దయాకర్‌ రెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌
నవతెలంగాణ-కామేపల్లి
క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం పెరుగుతుందని, విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో రాణించాలని మంత్రి పొంగులేటి కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో గత వారం రోజులుగా బోడెపుడి ట్రస్ట్‌ చైర్మెన్‌ రాజా ఆధ్వర్యంలో యువతని ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ ముగింపు సందర్భంగా నేడు కామేపల్లి మండల కేంద్రంలో జరిగిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌, మంత్రి పొంగులేటి కార్యాలయ ఇన్చార్జి తంబూరి దయాకర్‌ రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత గెలుపు ఓటములో సహజమేనని ఓడిన వారు రాబోవు రోజుల్లో ఎలా గెలవాలి అని ఉద్దేశంతో ముందుకు పోవాలని నిరుచ్చాహ పడకూడదని అన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆటలతోపాటు విద్యలో కూడా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రత్యేక కృషి చేయాలని సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిపి డైరెక్టర్‌ మేకల మల్లిబాబు యాదవ్‌, ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు గింజల నరసింహరెడ్డి, ఎంపిటిసి సునీత, లక్ష్మీనారాయణ, గూగుల్త్‌ గబ్రూనాయక్‌, సుమన్‌, రామనాధం, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

Spread the love