తునికాకు టెండర్లు వెంటనే నిర్వహించాలి

తునికాకు టెండర్లు వెంటనే నిర్వహించాలి– మంత్రి కొండా సురేఖకు ఏఐఏడబ్ల్యూయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తునికాకు టెండర్లను ప్రభుత్వం వెంటనే నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్‌ వెంకట్రాములు, ఉపాద్యక్షులు బి ప్రసాద్‌, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్‌ బి పద్మ సోమవారం మంత్రి కొండా సురేఖకు వినతి పత్రం సమర్పించారు.
రాష్ట్రంలో తునికాకు సేకరణ రెండో ప్రధాన ఉపాధిగా ఉన్నదని తెలిపారు. దీని వల్ల వచ్చే ఆదాయంతో వేలాది కుటుంబాలు బతుకుతాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే టెండర్లు పిలవాలని కోరారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకనుగుణంగా తునికాకు కట్ట రేటును పెంచాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ బోనస్‌ రూ. 280కోట్లను విడుదల చేసి పంపిణీ చేయలేదనీ, వాటిని వెంటనే పంపిణీ చేయాలని కోరారు.

Spread the love