– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ ప్రభుత్వం రైతులపై దమననీతిని కొనసాగిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. అన్నదాతలపై నిరంకుశ ధోరణులను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ పార్టీ ఆధ్వర్యం లో తమ నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరి హద్దుల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను మోడీ సర్కార్ క్రూరంగా అణచివేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల బాధల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో నిరసన తెలుపు తున్న వారిపై జరిగిన పోలీస్ కాల్పుల్లో శుభకరన్ సింగ్ అనే రైతు మృతి చెందారనీ, ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోడీ తప్పుడు వాగ్దానాలు చేశారని దుయ్యబట్టారు. వారిని విశ్వాసంలోకి తీసుకోకుండా రైతు వ్యతిరేక చట్టాలను ప్రయోగించి బడా వ్యాపారులకు వ్యవసా యాన్ని అప్పగించేం దుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. పంటలకు కనీస మద్దతు ధరపై కేంద్రం చట్ట పరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించ కుంటే దేశ వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తా మని నారాయణ హెచ్చరించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మోడీ సర్కార్.. రైతులను తీవ్రంగా నష్టపరిచే వివా దాస్పద వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పారు. రైతులు మును పెన్నడూ లేని విధంగా కష్టాల్లో కూరుకుపో తున్న నేపథ్యంలో తమ సమస్యల పరిష్కరానికి ఆందోళన లు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి బాధల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు.కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, బాలమల్లేశ్, కె శంకర్, ఏఐటీ యూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, ఎన్‌ఎఫ్‌ఐ డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్. అంజయ్య నాయక్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.డా. కె. నారాయణ తోపాటు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, కలవేణి శంకర్, ఎన్. బలమల్లేష్, ఈ.టి. నరసింహ, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య పాల్గొన్నారు.