– దగ్ధమైన ముఖ్యమైన ఫైళ్లు ..ఘటనపై పలు అనుమానాలు
నవతెలంగాణ -నల్లగొండ టౌన్
నల్లగొండ జెడ్పీ ఆడిటింగ్ సెక్షన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ముఖ్యమైన పైళ్లు దగ్ధ మయ్యాయి. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదమా.. లేదంటే కుంభ కోణాలు బయట పడకుండా అవినీతిపరులు చేసిన కుట్రనా అని పలువురు చర్చించు కుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ పట్టణంలోని పాత జిల్లా పరిషత్ భవనంలో ఆడిటింగ్ సెక్షన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముఖ్యమైన రికార్డులతోపాటు ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. సిబ్బంది గమనించి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే సంఘ టనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపుచేసింది. అప్పటికే రికార్డులు పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయంపై ఉన్నతాధికా రులు పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. గతంలో కూడా నల్లగొండ మున్సిపల్ ఆఫీస్‌లో అక్రమాలు బయట పడకుండా ఫైళ్లను తగలబెట్టారు. విషయాన్ని బయటికి పొక్కకుండా సిబ్బంది ప్రయత్నం చేశారు.