కన్నడ నిర్మాత, రచయిత, దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన చిత్రం ‘లవ్ మోక్టైల్ 2’. ఈ మూవీ నుంచి ‘ఎవరితో పయనం..’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించారు. ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా, యోగి సురేష్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ, లవ్ మాక్‌టైల్ వంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే తాను నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ, హీరోగా నటించిన ‘లవ్ మోక్టైల్, లవ్ మోక్టైల్ 2’ చిత్రాలతో కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోలకతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎంవిఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్‌తో గ్రాండ్‌గా మీ ముందుకు వస్తాం’ అని తెలిపారు.