మళ్లీ పుట్టి వచ్చినవా…

Are you born again?ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రంగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై చదలవాడ పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్‌ సాంగ్‌ ‘మళ్లీ పుట్టి వచ్చినవా..’ని రిలీజ్‌ చేశారు. ఈ పాటకి సాబు వర్గీస్‌ మ్యూజిక్‌ అందించగా, వరికుప్పల యాదగిరి రచయితగా, గాయకుడిగా వస్తున్న ఈ పాట సినిమాకి పెద్ద ఎసెట్ట్‌గా నిలుస్తుంది. పాన్‌ ఇండియా సినిమాగా 8 భాషల్లో ఈ సినిమాను మేకర్స్‌ మన ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం సెన్సార్‌ వర్క్‌ నడుస్తోంది. అతి త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘మా సినిమా నుంచి సెకండ్‌ సాంగ్‌గా ‘మళ్లీ పుట్టి వచ్చినవా..’ సాంగ్‌ని విడుదల చేశాం. ఇప్పటివరకు రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌కి మంచి స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని మంచి బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చాలా సపోర్ట్‌ ఇచ్చారు. అతి త్వరలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేసి, రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయబోతున్నాం. ప్రేక్షకులందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్య కృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్న కుమార్‌, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : అంజిరెడ్డి శ్రీనివాస్‌, సంగీతం : సాబు వర్గీస్‌, ఎడిటింగ్‌ : వెలగపూడి రామారావు, డిఓపి : కంతేటి శంకర్‌.

Spread the love