ఎవరూ ఊహించని ఆట

ఎవరూ ఊహించని ఆటగీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. కస్తూరి క్రియేషన్స్‌ అండ్‌ గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ, ‘ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. త్వరలో మిగతా పాటలు, ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తాం. ‘రథం’ ఫేమ్‌ గీతానంద్‌ ఈ చిత్రంతో హీరోగా నెక్ట్స్‌ లెవల్‌కు వెళ్తాడన్న నమ్మకం ఉంది. నేహ సోలంకి తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుంది. దర్శకుడు దయానంద్‌ ఈ చిత్రాన్ని అద్భతంగా తెరకెక్కించాడు. కీలక పాత్ర పోషించిన మధుబాల గతంలో ఎన్నడూ చేయని పాత్ర ఇందులో చేశారు. న్యూఏజ్‌ కథతో రూపొందిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది’ అని తెలిపారు. ‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి రియల్‌ టైమ్‌ సైకలాజికల్‌ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు?, గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోవడానికి కారణం ఏమిటి?, ఈ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌ ఆకట్టుకుంటాయి’ అని దర్శకుడు దయానంద్‌ చెప్పారు.

Spread the love