పతంగ్‌ల పోటీతో సినిమా

పతంగ్‌ల పోటీతో సినిమాఇప్పటి వరకు భారతీయ సినిమాల్లో ఎన్నో స్పోర్ట్స్‌ డ్రామాలు ప్రేక్షకులు చూసి ఉంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘పతంగ్‌’. సినిమాటిక్‌ ఎలిమెంట్స్‌ అండ్‌ రిషన్‌ సినిమాస్‌ పతాకంపై విజరు శేఖర్‌ అన్నే, సంపత్‌ మక, సురేష్‌ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్‌ ప్రత్తిపాటి దర్శకుడు.
నాని బండ్రెడ్డి క్రియేటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్ట్రాగమ్‌ సెన్సేషన్‌ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్‌ ప్రణవ్‌ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్‌ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్‌, నటుడు ఎస్‌పీ చరణ్‌ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఫైనల్‌ షెడ్యూల్‌ జరుగుతోంది. వేసవిలో విడుదల కానుంది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ చిత్రం న్యూపోస్టర్‌ను విడుదల చేశారు ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘సికింద్రబాద్‌ బస్తీ నేపథ్యంలో రూపొందుతున్న యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా ఇది. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది’ అని అన్నారు.

Spread the love