నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (జెన్‌కో)లో ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తు న్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు గురువారం జెన్‌కో సర్క్యూలర్ జారీ చేసింది. 339 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), 60 కెమిస్ట్ ఉద్యోగాల కోసం గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ నెల 16న ఎన్ని కల షెడ్యూల్ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.