తప్పుదారి పట్టిస్తున్న ప్రకటనలు

– పలు రోగాలకు చికిత్స అంటూ కల్తీ మందులు
– డీసీఏ దాడుల్లో పట్టివేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తప్పుడు ప్రకటనలు చేస్తూ ఔషధాల పేరుతో కల్తీ మందుల అమ్మకాలు డీసీఏ దాడుల్లో బయటపడుతున్నాయి. తాజాగా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇలాంటి కల్తీ మందులను గుర్తించి సీజ్‌ చేశారు. జనగామలో మూత్రపిండాల రాళ్లకు చికిత్స పేరుతో తప్పుడు ప్రకటనలు చేస్తూ అమ్ముతున్న స్టోన్‌ ఫిట్‌ లిక్విడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కీళ్లనొప్పులకు చికిత్స పేరుతో అమ్ముతున్న పనియన్‌ టాబ్లెట్లను గండిపేట, పుప్పాలగూడలో స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా కంటి వ్యాధులకు ఆయుర్వేద ఔషధాల పేరుతో సరఫరా చేస్తున్న సప్తమ్రిత్‌ లాV్‌ా టాబ్లెట్‌ లను సిరిసిల్ల డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ వీ.బీ.కమలాసన్‌ రెడ్డి మాట్లాడుతూ, తప్పుడు ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Spread the love