ముల్లంగిని మిస్‌కాకుండా తింటే..

ముల్లంగిని మిస్‌కాకుండా తింటే..కాలేయ ఆరోగ్యానికి ముల్లంగి తింటే మంచిదా? కాదా అని చాలామంది సందేహిస్తుంటారు. కొంతమంది అసలు ఈ ముల్లంగిని తినడానికే ఇష్టపడరు. మరి ముల్లంగిని మిస్‌కాకుండా తింటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. కాలేయ ఆరోగ్యానికి ముల్లంగి ఎంతో సహాయపడు తుంది. ముల్లంగిలో ఉండే గ్లూకోసినోలేట్స్‌ వంటి సమ్మేళనాలు కాలేయ ప్రక్రియల్లో సహాయపడతాయి. ముల్లంగిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అలాగే విటమిన్‌ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ముల్లంగి సూప్‌ లేదా జ్యూస్‌ని తాగితే.. కాలేయ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. కాలేయ కణాల పునరుత్పత్తిని పెంచుతుంది. ముల్లంగిలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. కాలేయ ఆరోగ్యానికి బరువు చాలా కీలకం. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ముల్లంగి ఎంతగానో సహాయపడుతుంది. ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకుంటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రవాహంలో టాక్సిన్స్‌ వడపోత ప్రక్రియలో ముల్లంగి సహాయపడుతుంది. ముల్లంగిలో ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ వంటి పోషకాలను అందిస్తుంది. ఇవి కాలేయ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పాటునందిస్తాయని న్యూట్రీషియన్లు చెబుతున్నారు.

Spread the love