ఓడేడ్ బ్రిడ్జిపై విచారణ చేస్తాం

– బాధితులపై చర్యలు తప్పవు
– రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల 
నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి ముత్తారం మండలంలోని ఓడేడ్, భూపాలపల్లి జిల్లాలోని గర్మిళ్లపల్లి మానేరుపై నిర్మాణ పనుల్లో ఉన్న వంతెన ఇటీవల భారీ గాలి బీభత్సంతో కుప్ప కూలిపోవడంపై తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన కాళేశ్వరం తోపాటు పలు బ్రడ్జీలు నాణ్యత లోపంతో నిర్మాణ పనులు చేపట్టారన్నారు. గుత్తేదారులు ఇచ్చే కమిషన్లకు బిఆర్ఎస్ నాయకులు కక్కుర్తి పడటంతో పనుల్లో నాణ్యత ప్రమాణాలను కాంట్రాక్టర్లు గాలికొదిలేశారన్నారు. సీఎం రేంవంత్ దృష్టికి తీసుకపోయి ఓడేడ్ బ్రిడ్జిపై విచారణ చేపట్టి బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మాణం కొనసాగుతున్న ఓడేడ్ బ్రిడ్జి బెండ్లు గాలికి కులడంపై పనుల్లో ఎంత నాణ్యత ఉందొ తెలుస్తోందన్నారు. బ్రిడ్జి కూలిన సమయంలో జనం లేకపోవడంతో ఊపిరి పీల్చున్నారని లేదంటే ప్రాణనష్టం జరిగేదన్నారు. ఖమ్మంపల్లి తాడిచెర్ల మానేరుపై నిర్మాణం చేపట్టిన వంతెనపై రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో అధికారులు బ్రీడ్జిని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ పాల్గొన్నారు.
Spread the love