
నవతెలంగాణ – నెల్లికుదురు
బైక్ మెకానికులను ప్రభుత్వమే ఆదుకోవాలని బైక్ మెకానిక్ నలుగురు మండల సంఘం అధ్యక్షుడు సంపత్ ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకొని జండా ఆవిష్కరించే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైక్ మెకానికులు నిరుపేద కుటుంబాలకు చెందిన వ్యక్తులమని తెలిపాడు. మెకానిక్ పనులతో కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా ఉంది కనుక మమ్ములను గుర్తించి మాకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి మాకు హెల్త్ కార్డులు మరియు పక్క ఇల్లు నివాసానికి ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికంగా ప్రభుత్వ సహకారం అందించాలని, నేరుగా బ్యాంకు తో ప్రతి మెకానిక్ ఎవరితో సంబంధం లేకుండా సబ్సిడీ రుణాలను మా బైక్ మెకానిక్ లకు విచ్చే ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, శ్రీకాంత్ యాకన్న సురేష్ తో పాటు కొంతమంది పాల్గొన్నారు.