అసిస్టెంట్ కమిషనర్ తో రథోత్సవాల నూతన కమిటీ సమావేశం

– అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ కు నూతన కమిటీ సన్మానం
– ఉత్సవాలు శాంతియుతంగా ఘనంగా జరుపుకోండి అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాలు ఈనెల 23న 24న జరగనున్నాయి రాబోయే రథోత్సవాల గురించి ఉమ్మడి నిజామాబాద్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ సమక్షంలో లక్ష్మీనారాయణ నూతన కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై రథోత్సవాలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయ నూతన కమిటీ సభ్యులకు రథోత్సవాల గురించి అడిగి తెలుసుకున్నారు. రథోత్సవాలను ఉత్సవంగా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. అసిస్టెంట్ కమిషనర్ తో ప్రత్యేకంగా సమావేశమైన శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయ కమిటీ చైర్మన్ సందూర్ వార్ హనుమాన్లు వైస్ చైర్మన్ బండి వార్ లక్ష్మణ్ కోశాధికారి కంచిన్ వార్ నాగేష్ కమిటీ సభ్యులు బండి వార్ అనిల్ ఆలయ కమిటీ సలహాదారులు బొగ్గుల వార్ సంజు ఆవార్వార్ హనుమాన్లు కమిటీ సభ్యులతో పాటు సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి వేణు పాల్గొన్నారు.
Spread the love