
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారానికి మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా, జుక్కల్ నియోజకవర్గం లో నీ మద్నూర్ మండలంలోని మేనూర్ పెద్ద ఎక్లారా గ్రామాల నుండి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు బస్సు యాత్రకు బయలుదేరి వెళ్లారు. బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వై గోవింద్ మహిళా నాయకురాలు సరస్వతి ఆధ్వర్యంలో ఇరు గ్రామాల నుండి భారీ ఎత్తున తరలి వెళ్లారు.