బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి రుణాలు పొందండి: ఏపిఎం చిన్నయ్య

నవతెలంగాణ – రెంజల్ 

బ్యాంకులో డ్వాక్రా గ్రూప్ మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి రుణాలు తీసుకోవాలని ఏపీఎం చిన్నయ్య కోరారు. సోమవారం రెంజల్ మండల సమాఖ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శ్రీనిధి రుణాలను క్రమం తప్పకుండా చెల్లించాలని ఆయన సూచించారు. ప్రతి నెల డ్వాక్రా మహిళ సంఘాలకు సమావేశాలను ఏర్పాటు చేసి రుణాల రికవరీపై వారికి అవగాహన కల్పించాలని సీఏ లకు ఆదేశించారు. గ్రూపులో ఎవరైనా రుణాలు చెల్లించినట్లయితే వారి వద్ద నుంచి గ్రూపు సభ్యులతో వెళ్లి అవస్థలు చేయాల్సి ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమస్య అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి మాధవి, కోశాధికారి లావణ్య, సిసి లు భాస్కర్, శివకుమార్, శ్యామల, కృష్ణ, రాజయ్య, సునీత, కంప్యూటర్ ఆపరేటర్ తస్లీమా, అకౌంటెంట్ శారద, గ్రామ అధ్యక్షులు, అమ్మ ఆదర్శ పాఠశాల ల అధ్యక్షులు పాల్గొన్నారు.
Spread the love