Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి కూలీల యోగాసనాలు..

ఉపాధి కూలీల యోగాసనాలు..

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ : మండలంలోని ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా కూలీలతో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాన్ని జుక్కల్ ఎంపీడీవో మరియు ఏపీవో తులసీరామ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఉపాధి హామీ కూలీలకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులు నిర్వహిస్తున్న దగ్గర అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి కూలీలకు ఎంపీడీవో వివరించారు అనంతరం వారిచేత యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది . యోగ చేయడం వలన పలు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని , అందువలన నిత్యజీవితంలో యోగా చేయడం చాలా ఉత్తమమని అన్నారు . అనారోగ్య సమస్యలు దరికి రాకుండా  యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఏపీఓ, ఈసీ స్వామి దాస్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -