రఫా గుడారాలు
చిద్రమవుతూ
పిల్లల దేహాలు
ముక్కలవుతూ
శత్రువు వేసిన బాంబు
కూడా నెత్తుటి కన్నీటి చుక్క
విడుస్తున్నది.
రఫా ఆకాశమంతా
మిస్సైల్లు కమ్ముకుని
చిన్నారుల కలలను
చిదిమేస్తున్నవి
ప్రపంచమంతా
చూస్తూ నిస్సహాయంగా
ద్ణుఖిస్తున్నది
పిడికిలెత్తిన
విశ్వ విద్యాలయాలు
నీ స్వేచ్చ కోసం
నినదిస్తున్నవి
ఇక్కడి బస్తర్
ఆదివాసీ గూడేలపై
కార్పొరేట్
డ్రోన్ల కళ్లతో శత్రువు
చూస్తూ సాగిస్తున్న
హత్యాచార దమనకాండ
పాలస్తీనా
బస్తర్ రెండూ
నెత్తుటి ఆకాశంలో
వెలసిన నెలవంకలు
మీ ఆశల విత్తులు
నాటిన ఈ భూమి
మీ కలల ఫలాలను
తప్పక పుష్పిస్తుంది….
– కెక్యూబ్ వర్మ
9493436277