బీజేపీ మళ్లీ గెలిస్తే మనకిదే చివరిఓటు

బీజేపీ మళ్లీ గెలిస్తే మనకిదే చివరిఓటుకార్పొరేట్లు-మతం కుమ్మక్కయి దేశాన్ని కొల్లగొడుతున్నాయి. బీజేపీ అనుమతిస్తున్న ఈ దోపిడీకి తృణముల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) వంటి ప్రాంతీయ పార్టీలు మద్దతునిస్తున్నాయి. కార్పొరేట్‌ సంస్థలు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా పాలక వర్గ రాజకీయ పార్టీలకు రూ.వేల కోట్లు చందాలిచ్చి దందా చేసుకోవడం చూశాం. క్విడ్‌ ప్రో కో (నీకు ఇంత నాకు అంత) పద్ధతిలో ప్రజల ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, పర్యావరణ వ్యవస్థలన్నిటిపైనా దాడికి దిగడం చూస్తున్నాం. పైగా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర, సమాఖ్య వ్యవస్థ ఉనికి బీజేపీ పాలనలో ప్రమాదంలో పడింది. బీజేపీ ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ జపం చేస్తున్నందున ఇదే చివరి ఓటుగా మారే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో వామపక్షాల బలం పెరగాల్సి వుందని, సామాజిక నిబద్ధత, రాజకీయ నైపుణ్యం కలిగిన ప్రతినిధులు పార్లమెంటుకు చేరుకోవాల్సి వుందంటున్నారు సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ మహ్మద్‌ సలీమ్‌. ‘దేశాభిమాని’ పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు.
ఈ లోక్‌సభ ఎన్నికల ప్రాముఖ్యత ఏమిటి?
సాధారణ ఎన్నికల ముంగిట్లో వున్నాం. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు ఓ ప్రాధాన్యత వుంది. దేశంలో ఇంకెన్ని ఎన్నికలు జరుగు తాయో తేల్చే ఎన్నికలివి. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అని బీజేపీ చెప్తున్నది. అందువల్ల ఇదే చివరి ఓటు అయ్యే అవకాశం కూడా ఉంది. బీజేపీ పదేండ్ల పాలనలో రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య, లౌకిక, సమాఖ్య రిపబ్లిక్‌ ఉనికి ప్రమాదంలో పడింది. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా లౌకికవాదం వుండ దు. సెక్యులరిజం లేకుండా ప్రజాస్వా మ్యం వుండదు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతో లౌకిక, ప్రజాతంత్ర రిపబ్లిక్‌కు చరమగీతం పాడుతోంది. మామూలుగా ఎన్నికలంటే రాజ కీయ పోరాటం. ఈ ఎన్నికలలో ఆలోచనల మధ్య పోరు జరుగుతున్నది. ప్రతిపక్ష నేత ఎవరు? అని మోడీ ప్రశ్నించారు. ఇక్కడ నాయ కుడు ఎవరన్నది సమస్య కాదు. విధానాలు ముఖ్యం. పార్లమెంట్‌ స్థానంలో కార్పొరేట్‌ ప్రతి నిధులు వుంటారు. కార్పొ రేట్లు-మతం కుమ్మక్కయి దేశాన్ని నాశనం చేస్తున్నాయి. సహజ వనరులను కూడా కొల్లగొడుతున్నారు. బీజేపీ అనుమతిస్తున్న ఈ దోపిడీకి టిఎంసి వంటి ప్రాంతీయ పార్టీలు మద్దతునిస్తున్నాయి. కార్పొరేట్‌ సంస్థలు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం చూశాం. లాభాల కోసం ప్రజల ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, పర్యా వరణ వ్యవస్థలు అన్నిటిపైనా దాడికి దిగడం చూస్తున్నాం. జమ్మూకశ్మీర్‌, మణిపూర్‌లు బీజేపీ విభజిత, విద్వేష విధానాలకు బలయ్యాయి. ‘హిందూ రాష్ట్ర’ పేరుతో భారత దేశాన్ని ఫాసిస్టు మతపరమైన దేశంగా మార్చే ప్రణాళికతో ఆర్‌ఎస్‌ఎస్‌ అడుగులు వేస్తోంది. అయితే ఇటువంటి దుష్ట పన్నాగాలకు ముగింపు పలికే అవకాశాన్ని ఈ ఎన్నికలు మనకు అందించాయి.
బెంగాల్‌లో పరిస్థితి ఏమిటి?
బెంగాల్‌ వివిధ మతాలు, సంస్కతుల మిశ్రమం. ఇస్లాం, సూఫీ, క్రిస్టియన్‌, జైన మతాలు ఇక్కడ వున్నాయి. కేరళలో నారాయణగురు ముందుకు తెచ్చిన ఉద్యమమే బెంగాల్‌లో జరిగింది. మతాన్ని, భాషను రాజకీయంగా వినియోగించడాన్ని బెంగాల్‌ ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. బెంగాలీ కూడా మిశ్రమ భాషే. పోర్చుగీస్‌, పర్షియన్‌, అరబిక్‌, సంస్కృతం, ఇంగ్లీష్‌, టర్కిష్‌ భాషల మిశ్రమం బెంగాలీ. ఈ విధమైన వైవిధ్యం కలిగి వున్నందుకు బెంగాల్‌ ఎంతగానో గర్వించింది. అయితే, మమతా బెనర్జీ సహకారంతో ఆర్‌ఎస్‌ఎస్‌ వీటన్నింటినీ నాశనం చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలను అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేని సమయంలో వాటికి బెంగాల్‌లో ఒక అడ్రస్‌ కల్పించింది మమతా బెనర్జీ, తణమూల్‌ కాంగ్రెస్సే. బెంగాల్‌లో మమత ఒకప్పుడు బీజేపీని జాతీయ మిత్రపక్షంగా అభివర్ణించారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని టిఎంసి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది.నేడు బెంగాల్‌లో అవినీతి తీవ్ర సమస్యగా వుంది. సీపీఐ(ఎం) వామపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాలో బీజేపీ ఎదగలేకపోయింది. బీజేపీని, దాని మిత్రపక్షాలను, పూర్వ మిత్రపక్షాలను ఓడించడమే లెఫ్ట్‌ఫ్రంట్‌ విధానం. నిబద్ధత, రాజకీయ అవగాహన ఉన్న ప్రజాప్రతినిధులు పార్లమెంటుకు రావాలి. వామపక్షాలు దీన్ని సాధించగలవు.
లెఫ్ట్‌ఫ్రంట్‌ లక్ష్యం, పాత్ర ఏమిటి?
ఇవి జాతీయ స్థాయి ఎన్నికలు అయినప్పటికీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి నెలకొంది. మణిపూర్‌, బెంగాల్‌, మహారాష్ట్ర, కేరళలో ఒకేవిధమైన పరిస్థితి లేదు. అందుకే రాష్ట్ర స్థాయిలో సీట్ల ఒప్పందాలు చేసుకోవాలని ‘ఇండియా’ వేదిక నిర్ణయించింది. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో లెఫ్ట్‌ ఫ్రంట్‌ సీట్ల సర్దుబాటు కుదుర్చుకుంది. సీపీఐ(ఎం) 23 స్థానాల్లోను, ఫ్రంట్‌లోని ఇతర భాగస్వామ్య పార్టీలు ఏడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు 12 స్థానాలున్నాయి. బిజెపి, టిఎంసీలను ఓడించాలన్న లక్ష్య సాధన కోసమే ఇదంతా.బీజేపీ, టిఎంసీల మధ్య ముఖాముఖి పోటీ వుందన్న కథనాన్ని ఆ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే బెంగాల్‌లో గట్టి ముక్కోణపు పోటీ వుంది. అవినీతి, మతతత్వపు ముప్పు నుంచి బెంగాల్‌ను కాపాడాలి.
లెఫ్ట్‌ఫ్రంట్‌కు అనుకూలంగా ఉన్న అంశాలు?
క్రూరమైన దాడులను తట్టుకుని సీపీఐ(ఎం)ను పటిష్టంగా నిర్మించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి.సీపీఐ(ఎం)లో అంకితభావం, చిత్తశుద్ధి, రాజకీయ విద్యావంతులైన కార్యకర్త లున్నారు. అంతేగాక యువతీ యువకులు పెద్ద సంఖ్యలో వున్నారు.టిఎంసీ, బీజేపీలోని అవినీతిపరులైన నేతలు పరస్పరం పార్టీలు ఫిరాయిస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంతో సహా అనేక స్కాముల్లో టిఎంసీ నేతలు సాక్ష్యాధారాలతో పట్టుబడ్డారు. పన్నెం డేళ్ల టిఎంసి పాలన తర్వాత కూడా రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రాలేదు. అభివృద్ధి జరగలేదు. ఇలావుండగా బీజేపీ రామాలయం, రామన వమి వంటి అంశాల గురించి మాట్లాడు తున్నది. లెఫ్ట్‌ఫ్రంట్‌ పాలన బాగుందని ప్రజలు ఇప్పుడు అంటున్నారు. వారు శాంతియుత మైన, అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారు.
పార్లమెంట్‌లో వామపక్షాల ప్రాధాన్యత?
వామపక్షాలను, ముఖ్యంగా సీపీఐ(ఎం)ను లేకుండా చేయాలనుకుంటోంది ఆర్‌ఎస్‌ఎస్‌. కార్పొరేట్లదీ అదే దుష్టతలంపు. అయితే రైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, మహిళలు, విద్యార్థులు, యువత తరపున వామపక్షాలు పోరాడుతున్నాయి. అంతేగాక ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలను రాజకీయంగా ఎండ గట్టి, ఎదుర్కొంటున్నాయి. దాంతో ఆర్‌ఎస్‌ ఎస్‌, కార్పొరేట్ల కంటికి వామపక్షాలు అడ్డంకిగా కనిపిస్తున్నాయి. వామపక్షాలను బలహీన పరచేందుకు ఆ పార్టీలు ప్రయత్ని స్తూనే వున్నా యి. పలు సందర్భాలలో వారనుకున్నట్టే చేశాయి కూడా. ఇది దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సామాజిక నిబద్ధత, రాజకీయ నైపుణ్యం కలిగిన ప్రతినిధులు పార్లమెంటుకు చేరుకోవాలి. వామపక్షాలు ఈ లక్ష్యాన్ని సాధించగలవు.

Spread the love