పంపిణీకి సిద్ధంగా ఉన్న ఏకరూప దుస్తులు..

నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలం ఐకెపి మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో తయారుచేసిన ఏకరూప దుస్తులు సిద్ధంగా ఉంచినట్లు ఏపీ ఎం చిన్నయ్య తెలిపారు. శనివారం టైలరింగ్ మహిళలు, వివో ఏ లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు.  మండలంలో నాలుగు గ్రామాలలో ఏర్పాటుచేసిన మహిళ టైలరింగ్ విభాగంలో మండలానికి చెందిన ఒకటి నుంచి 12 వ తరగతి విద్యార్థులకు ఏకరూప దుస్తులను పూర్తి చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మరో నాలుగు రోజులలో పూర్తవుతుందని ఆయన తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 3913 డ్రెస్సులను పూర్తి చేశామని ఆయన అన్నారు. సంబంధిత అధికారులతో త్వరలోనే ఆయా పాఠశాలలకు అప్పగించిట్లు ఆయన పేర్కొన్నారు. టైలరింగ్ మహిళలు, మండల సమాఖ్య సిబ్బంది, వివో ఏలు, పాల్గొన్నారు.
Spread the love