
రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎనిమిదవ వార్డులో ఒకరికి డెంగ్యూ వ్యాధి నిర్ధారణ కావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వినయ్ కుమార్ తో పాటు వైద్య సిబ్బంది పట్టి వార్డును సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి గృహస్తిని ఇంటి చుట్టూ 100 ఇండ్లలో పేరి డొమెస్టిక్ నిర్వహించడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాత టైర్లు కొబ్బరి చిప్పలు నీటి నిల్వ ఉండకుండా చూడాలని వారు సూచించారు. వారం ఇంకోసారి నీటి తొట్టిలను శుభ్రపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఆరోగ్య విద్యను అధికారి శ్రావణ్ కుమార్, వైద్య సిబ్బంది విజయ చిన్నయ్య, రామకృష్ణ, ఆరోగ్య సిబ్బంది స్వప్న ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.