Sunday, June 29, 2025
E-PAPER
Homeచైల్డ్ హుడ్తాతయ్య తెచ్చిన మార్పు...

తాతయ్య తెచ్చిన మార్పు…

- Advertisement -

ఒక గ్రామంలో అల్లరి పిల్లవాడైన చింటూ ఉండేవాడు. చింటూకి ఆటలంటే చాలా ఇష్టం. ఆటల్లో మమేకమై చదువుని అశ్రద్ధ చేసేవాడు. తోటి మిత్రులతో ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూ ఉండేవాడు.
ఉపాధ్యాయులు చెప్పిన ఏ విషయాన్నైనా పెడ చెవిన పెడుతూ, అతడు చేయవలసిన హోం వర్క్‌ తన మిత్రులతో చేపిస్తూ, అలా తన పనిని చేసిన వారితో మాత్రమే ఆడుకునేవాడు.
పైగా తల్లితండ్రుల గారాబం ఎక్కువ. తమ అబ్బాయిలో ఏదో ఒక రోజు మార్పు వస్తుందని అతనిని దండించవద్దని ఉపాధ్యాయులతో చెప్పేవారు.
అలా గడుస్తున్న రోజుల్లో వేసవి సెలవులు రానే వచ్చాయి. చింటూకి ఎంతో ఇష్టమైన తాతయ్య ఊరికి తీస్కుని వెళ్ళింది అమ్మ.
తాతయ్యకి చింటూపై ఎంతో ప్రేమ. చింటూ చేసే అల్లరిని తాతయ్య ఎంతో ఇష్టపడేవాడు. చింటూ అందరితో ఆడుకోవడం, గొడవపడటం తాతయ్య చూస్తూ ఉండేవాడు.
చింటూ తన అవసరాలు తీర్చే వారిని మాత్రమే మిత్రులుగా భావించడం తాతయ్య గమనించాడు.
ఒక రోజు చింటూ తన మిత్రులతో గోడవపడి ఏడుస్తూ తాతయ్య దగ్గరికి వచ్చాడు. తాతయ్య చింటుని చూసి ”చింటూ ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాడు.
అప్పుడు చింటూ ”తాతయ్య నాకు ఎవరు మంచి మిత్రులు లేరు. అందరు నాతో ఆడుకునే వరకు మాత్రమే మాట్లాడుతారు. ఆ తర్వాత గొడవపడి ఎవరు నా దగ్గరికి కూడా రారు” అంటూ బాధపడతాడు.
అప్పుడు తాతయ్య చింటూతో – ”చింటూ నువ్వు అల్లరి పిల్లాడివైనా మంచి వాడివి. మనం ఇతరుల నుండి సహాయం పొందడం కన్న వారి నుండి ఏమీ ఆశించక సహాయం చేయడం గొప్ప. నువ్వు నీ పనులు చేస్తున్న వారిని మాత్రమే స్నేహితులుగా భావించి వారితో ఆడుకుంటున్నావు. నువ్వు వారితో ఎలాంటి స్వార్థం లేకుండా స్నేహం చేస్తూ ఆడుకో తప్పకుండా మంచి మిత్రులని పొందుతావు. చింటూ.. ఆటలు ఒక్కటే కాదు, నువ్వు చదువులో కూడా ముందు ఉన్నపుడే ఉపాధ్యాయులు, నీతోటి స్నేహితులు నిన్ను ఎంతో అభిమానిస్తారు” అని తాతయ్య చెప్పాడు.
తాతయ్య మాటలు చింటూలో ఎంతో మార్పు తెచ్చాయి. ఆ తర్వాత చింటూ తన హోంవర్క్‌ తాను చేసుకుంటూ అందరితో ప్రేమగా మాట్లాడుతూ, ఆడుకుంటూ మంచి స్నేహితులని పొందాడు.
చదువులో కూడా రాణించాడు, క్లాస్‌ ఫస్ట్‌ వచ్చిన చింటూని చూసి అతని ఉపాధ్యాయులు, తల్లితండ్రులు ఎంతో సంతోషపడ్డారు.
చింటూలో వచ్చిన మార్పు గురించి అమ్మ చెప్పిన మాటలు విన్న తాతయ్య.. మళ్ళీ సెలవుల్లో చింటూని కలవడానికి తాతయ్య ఎంతో ఎదురుచూసాడు.
– శారద అభిలాష్‌, ఎండపల్లి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -