
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన టెంట్ సాగర్ వాళ్ల నాన్న నాగన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకేట రవి, మాజీ సిడిసి చైర్మన్ కొమ్ముల రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, నాయకులు సుంకేట బుచ్చన్న, సుంకరి విజయ్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలంలో
వేల్పూర్ మండలం పోచంపల్లిలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరమర్శించారు. గ్రామానికి చెందిన రాజేశ్వర్ ఇటీవల గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అదే గ్రామానికి చెందిన లింగా రెడ్డి కాలు ఇన్స్పెక్షన్ కావడంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయనను పరామర్శించారు. గ్రామానికే చెందిన లింగారెడ్డికి ఇటీవల ఆపరేషన్ జరిగింది. ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.